ఇతిహాసాల్లో గొప్ప సాహిత్యం ఉంది


Mon,November 11, 2019 11:31 PM

సిద్దిపేట టౌన్ : రామాయణ, మహా భారత, భాగవతాది పు రాణ ఇతిహాసాల్లో గొప్ప సాహిత్యం దాగి ఉందని ప్రముఖ కవి ప ప్పుల రాజిరెడ్డి అన్నారు. మంజీర ర చయితల సం ఘం ఆధ్వర్యంలో మంజీర స్వరంలో భాగంగా వర్తమాన వచన, సాహిత్యం ఒక విశ్లేషణ అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి పప్పుల రా జి రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రాచీన ప్రబంధ సాహిత్యాన్ని తదనంతరం వచ్చిన ఆధునిక వచన సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూనే మంచి సా హిత్యం వెలువడుతుందన్నారు. 19వ శతాబ్దంలో వ చ్చిన ఆధునిక సాహిత్యం కూడా సాహిత్యంలో గొప్ప మార్పు తెచ్చిందన్నారు.

వేమనలాంటి కవులు నీతి శతకాల ద్వారా సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు. శ్రీశ్రీ, తిలక్ లాంటి కవులు ప్రజల పరం చేశారని, ప్రాచీన సాహిత్యాన్ని కాచి వడబోచిన శ్రీశ్రీ వచన సాహిత్యాన్ని తనదైనశైలిలో ముందుకు తీసుకెళ్లారన్నారు. కాళోజీ, దాశరథి, వట్టికోట అళ్వార్ స్వామి, సి.నారాయణరెడ్డి లాంటి కవులు అభ్యుదయ సాహిత్యం వెలువరించారన్నారు. అంతకు ముందు మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి మాట్లాడుతూ ప్రతి నెల మంజీర స్వరం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మరసం కార్యదర్శి యాదగిరి, ప్రతినిధులు అంజయ్య, తోట అశోక్, అలాజీపూర్ కిషన్, పొన్నాల బాలయ్య, గంభీర్‌రావుపేట యాదగిరి, రాజశేఖర్‌రెడ్డి, కుమార్, పర్శరాములు, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...