నేటి నుంచే స్వేరోస్ క్రీడలు షురూ


Mon,November 11, 2019 11:30 PM

కొండాపూర్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ గురుకులంలో మంగళవారం నుంచి రాష్ట్ర స్థాయి 6వ స్వేరోస్ ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు నాలుగు రోజుల పాటు క్రీడలు జరుగనున్నాయి. రాష్ట్రస్థాయి 6వ స్వేరోస్ ఒలింపిక్ క్రీడా పోటీల్లో ఉమ్మడి 10 జిల్లాల గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. నాలుగు జోన్ల నుంచి 88 గురుకుల పాఠశాలల విద్యార్థులు సోమవారం కొండాపూర్‌లోని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో విద్యతోపాటు, క్రీడల్లో ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. గురుకుల పాఠశాలల విద్యార్థుల నైపుణ్యన్ని గుర్తించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ సహకారంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే క్రీడలకు అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...