ముందస్తు వ్యాధి నివారణకు హోమియోపతి మందులు


Sun,November 10, 2019 11:44 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : డెంగీ, చికున్ గన్యా తదితర వైరల్ ఫివర్లతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాటికి ముందస్తు జాగ్రత్తలు అవసరమని అటవీ, పర్యటక అభివృద్ధి కార్పొరేషన్‌ల చైర్మన్లు ప్రతాప్ రెడ్డి, భూపతి రెడ్డితో పాటు భూంరెడ్డి, డా. యాదవ్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌లో టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెంగీ, చికున్ గన్యా, వైరల్ ఫివర్‌లకు వ్యాధి నివారణకు హోమియోపతి మాత్రలు ఉచితంగా పంపిణీ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు. హోమియోపతి మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. మందులను పంపిణీ చేయడానికి టి. రాజు ముందుకు రావడం హర్షనీయమని ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. భూపతిరెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డి మాట్లాడుతూ హోమియోపతి మందులతో వ్యాధి నివారణతో పాటు ఆరోగ్యకరమైన జీవితం ప్రజలకు సమకూరుతుందన్నారు.

మూడు వారాలు వాడాలి
హోమియో మందులు వ్యాధి నివారణకు అద్భుతంగా పనిచేస్తాయని టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ టి.రాజు తెలిపారు. వారానికి రెండు రోజులు చొప్పున మూడు వారాలు క్రమం తప్పకుండా వాడటం వల్ల డెంగీ, చికున్ గన్యా, విష జ్వరాలు దరిచేరవన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు మాదాసు శ్రీనివాస్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బెండ మధు, గోపాల్‌రెడ్డితో పాటు బొగ్గుల సురేశ్, ఆకుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...