సిద్దిపేట టౌన్ : సమాజంలో ఉన్న సమస్యలపై స్పందించే మొదటి వ్యక్తి కవి అని.. కవులు సమాజ నిర్మాణం కోసం చేస్తున్న రచనలు ప్రతి ఒక్కరూ చదివి మంచి మార్గంలో పయణించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. సిద్దిపేట సరస్వతీ శిశుమందిర్‌లో జాతీయ సాహిత్య పరిషత్ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ మహోత్సవానికి ఆదివారం ఆయన హాజరై పలు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ సిద్దిపేట జాతీయ సాహిత్య పరిషత్ చిన్నారులు, పె ద్దల కోసం రచనలు చేస్తూ దేశభక్తిని పెంపొందిస్తున్నదన్నారు. ప్రతి ఒక్కరూ సాహిత్యాన్ని అవగ తం చేసుకున్నప్పుడే సమసమాజం ఏర్పడుతుందని, అందరూ సాహిత్య పఠనం చేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయిత చంద్రయ్య, కవులు ఎన్నవె ల్లి రాజమౌళి, ఉండ్రాల రాజేశం, రామచందర్‌రా వు, సత్యనారాయణ, అశోక్, లక్ష్మయ్య, లింగమూర్తి, లక్ష్మి,నర్సింహారావు,పుండరీకం ఉన్నారు.