మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ


Sun,November 10, 2019 11:43 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు రద్దీ నెలకొంది. మల్లికార్జునస్వామిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 20 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్ తెలిపారు. కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతోపాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతిగీరలు వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు నిర్వహించారు. భక్తులకు ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకుడు నీల శేఖర్, సిబ్బంది అర్చకులు, ఒగ్గు పూజారులు తదితరులు భక్తులకు సేవలందించారు.

*మల్లన్నను దర్శించుకున్న న్యాయమూర్తి
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని సిద్దిపేట కోర్టు న్యాయమూర్తి భవానీప్రసాద్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన న్యాయమూర్తిని ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి.. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...