చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి


Sat,November 9, 2019 11:22 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య మాట్లాడుతూ పూర్వపు వరంగల్ జిల్లాలో చేర్యాల చివరి ప్రాంతం కావడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాలు సిద్దిపేటలో చేరినట్లు తెలిపారు. మూడు మండలాల ప్రజలకు అవసరమైన కార్యాలయాలు ఇతర ప్రాంతాల్లో(హుస్నాబాద్, గజ్వేల్, సిద్దిపేట) ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. మూడు మండలాలకు చెందిన 53 గ్రామాల ప్రజలు చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు చేర్యాలకు అన్ని అర్హతలున్నాయని, సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం సైతం కొనసాగుతున్నదని తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, యువజన సంఘాలు చేసిన తీర్మాన పత్రాలను మంత్రి, కలెక్టర్‌కు అందించారు. అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజు, నాయకులు అంజయ్య, చుక్కారెడ్డి పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...