తూప్రాన్ ప్రభుత్వ దవాఖాన ఆకస్మిక తనిఖీ


Sat,November 9, 2019 11:22 PM

తూప్రాన్ రూరల్: తూప్రాన్ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను శనివారం గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. దవాఖానలోని పలు వార్డులు ఆయన కలియ తిరుగతూ క్షుణ్ణంగా పరిశీలించారు. దవాఖానకు ప్రతి రోజూ వచ్చే ఇన్‌పేషంట్‌లు, ఔట్ పేషంట్ల సంఖ్యపై వైద్యుల నుంచి ఆరా తీశారు. దవాఖానలోని ల్యాబ్, ఎక్స్‌రే, గైనకాలజిస్ట్ వార్డులు నిశితంగా పరిశీలించారు. వైద్య సేవలు అందుతున్న విధానంపై వార్డుల్లోని ఇన్ పేషంట్లుగా చేరిన వారి నుంచి ఆయన అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన ఔట్ పేషంట్‌లు, ప్రమాదవశాత్తు దవాఖానలో చికిత్స పొందుతున్న హాజరు రిజిష్టర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...