18న ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా సదస్సు


Fri,November 8, 2019 11:06 PM

సిద్దిపేట అర్బన్ : ఈ నెల 18న సిద్దిపేటలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా సదస్సును నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి పొట్ల రమేశ్ మాదిగ తెలిపారు. శు క్రవారం సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశాని కి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాదాసు థామస్, రాష్ట్ర కార్యదర్శి కాశీపాక రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట ఇచ్చిందని కానీ ఇప్పటి వరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టలేదని, బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ మొదటి వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భం గా జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కో రారు. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా సిద్దిపేట కాశీపాక రాజేందర్, గజ్వేల్‌కు కాదాసు థామస్, దు బ్బాకకు డప్పు శివరాజు, హుస్నాబాద్‌కు రాజేందర్, కో ఇన్‌చార్జిగా గుడికందుల ఎల్లంను ఎన్నుకోవడం జరిగిందన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...