పనులను వేగంగా పూర్తి చేయాలి


Fri,November 8, 2019 11:06 PM

గజ్వేల్‌రూరల్: ఆర్థిక శాఖ మంత్రి దత్తత గ్రామమైన గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కొల్గూరు గ్రామంలో నిర్మిస్తున్న ఫంక్షన్‌హాలు, దోబీఘాట్ తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. మరో పది రోజల్లో పనులను పూర్తి చేయాలని గడా ముత్యంరెడ్డి ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు సూచించారు. అలాగే పశువుల షెడ్డు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ప్రస్తుతం పంట ఉండగా మరో మూడు రోజుల్లో పంట కోత అవగానే షెడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలన్నారు. మంత్రి హరీశ్‌రావు గత నెలలో కార్యాచరణ పూర్తయిన వెంటనే గ్రామానికి వెళ్లి సర్పంచ్‌ను, ప్రత్యేకాధికారితో పాటు ప్రజాప్రతినిధులను, ప్రజలను అభినందించారు.

గ్రామాన్ని పూర్తి పరిశుభ్రంగా మార్చడంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఫంక్షన్‌హాలు, దోబీఘాట్ పూర్తి కోసం నిధులు మంజూరు చేశారు. తాను మరో నెలలో వచ్చే వరకు అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు గ్రామంలోని రెవెన్యూ సమస్యలు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అభివృద్ధి పనులు చురుకుగా జరుగుతుండగా, రెవెన్యూ సమస్యలు దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. కాగా, 15రోజుల్లో కొల్గూరు గ్రామంలోని పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించనున్నట్లు ముత్యంరెడ్డి తెలిపారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...