రూర్బన్ పనులు వారంలోగా కావాలి


Fri,November 8, 2019 11:05 PM

గజ్వేల్ రూరల్: గజ్వేల్ మండలంలో నిర్వహిస్తున్న రూర్బన్ మిషన్‌లో మొదటి విడుత పనులను వారంలోగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో పీడీ గోపాల్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దామోదర్‌రెడ్డితో కలిసి నేషనల్ రూర్బన్ మిషన్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీవో గోపాల్‌రావు మాట్లాడారు. గజ్వేల్ మండలంలో అన్ని శాఖల పరిధిలో రూర్బన్ మిషన్ ద్వారా 171పనులకు గానూ రూ.9కోట్లు మొదటి విడుతలో విడుదల కాగా, వాటిలో అక్టోబర్ మాసం నివేదికల ప్రకారం కేవలం 51పనులే పూర్తయ్యాయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు అందిస్తున్నా, వాటిని సద్వినియోగం చేసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరో వారం, పదిరోజుల్లోగా అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని రూర్బన్ మిషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

పనులను పూర్తి చేయడంలో కంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులు కంట్రాక్టర్లతో పూర్తిస్థాయిలో వారం, పది రోజుల్లో పూర్తి చేసి నివేదికలను సమర్పించాలన్నారు. పనులు పూర్తయిన నివేదికలను తిరిగి ప్రభుత్వానికి అందజేస్తేనే మిగతా రూ.21కోట్లు మంజూరవుతాయన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...