తపాస్‌పల్లిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం


Fri,November 8, 2019 12:08 AM

కొమురవెల్లి : ఎల్లమ్మ పండుగకు గురువన్నపేట అత్తగారింటికి వచ్చి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో బంధువులతో కలిసి ఈత కోసం రిజర్వాయర్‌లోకి దిగి గల్లంతైన కొండపాక మండలం కుకునూరుపల్లికి చెందిన సదుపల్లి సుధాకర్(32) మృతదేహం గురువారం లభించింది. బుధవారం మధ్యాహ్నం రిజర్వాయర్‌లో గల్లంతైన సుధాకర్ కోసం జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బుధవారం చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. గురువారం వేకువజామున సుధాకర్ మృతదేహం నీటిపై తేలడంతో స్థానిక జాలర్ల సాయంతో మృతదేహన్ని బయటకు తీసుకువచ్చిన పోలీసులు చేర్యాల పట్టణంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...