నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్


Fri,November 8, 2019 12:07 AM

దుబ్బాక టౌన్ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఎంతో అండగా ఉందని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చెల్లాపూర్‌కు చెందిన కాపరబోయిన అనితకు సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరైన రూ.60వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మిరుదొడ్డి ఎంపీపీ గజ్జెల సాయిలు, పీఏసీఎస్ అమ్మన రవీందర్‌రెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తౌడ శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు అస్క రవి, నాయకులు ఆసస్వామి, పర్సకృష్ణ తదితరులు ఉన్నారు.

నిరుపేదలకు సంజీవని..సీఎంఆర్‌ఎఫ్
దుబ్బాక, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నిరుపేదలకు సంజీవనిగా మారిందని అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో..దుబ్బాక మండలం రఘోత్తంపల్లికి చెందిన కాస్తి అనిల్‌కు మంజూరైన రూ.35 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి ఖరీదైన వైద్యం అందించేందుకు సీఎంఆర్‌ఎఫ్ ఒక సంజీవనిగా మారిందన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ అస్కరవి, కో ఆప్షన్ మెంబర్ హైమద్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పోలబోయిన నారాగౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు ఆస స్వామి, బట్టు ఎల్లం తదితరులున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...