దేశానికే ఆదర్శం ఇబ్రహీంపూర్


Wed,November 6, 2019 11:09 PM

నారాయణరావుపేట : ఇబ్రహీంపూర్ గ్రామం దేశాని కే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ క మిషనర్ రఘునందన్‌రావు అన్నారు. బుధవారం నా రాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రా మాన్ని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డీపీవో సురేశ్‌బాబు తో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో హరితహారం, ఇంకుడు గుంతలు, డంప్ యార్డు, పార్కు, ప్రాథమిక పాఠశాల, పందిరి సాగు విధానం, సామూహిక గొర్రెల షెడ్లు, వర్మీకంపోస్టు, వైకుంఠంధామం, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, ఫంక్షన్ హాల్, సీసీ కెమెరాల పనితీరు, ఓపెన్ జిమ్, ఇంకుడు గుంతలు నిర్మాణం వంటి పలు అభివృద్ధి ప నులను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయ తీ కార్యాలయంలో గ్రామంలో జరిగిన అభివృద్ధిని వీడియో రూపకంగా వీక్షించారు.

అంతకు ముందు గ్రామ పంచాయతీ రికార్డులను ఆయన పరిశీలించారు. పందిరి సాగు విధానంలో గ్రామంలోని రైతు మహిపాల్‌ను ఏ విధంగా సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇబ్రహీంపూర్ గ్రామ పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. గ్రామస్తుల ఐక్యతతోనే ఇవాళ ఇబ్రహీంపూర్ దేశంలోనే మోడల్ గ్రామంగా నిలిచిందన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామం వలే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు మురళీధర్‌శర్మ, సమ్మిరెడ్డి, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సర్పంచ్ దేవయ్య, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు ఎల్లారెడ్డి, నగేశ్‌రెడ్డి గ్రాస్తులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...