రేపు ప్రతాప్ రెడ్డి ప్రమాణ స్వీకారం


Mon,November 4, 2019 11:02 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఈ నెల 6న మాసబ్ ట్యాంక్ పరిధిలోని బంజార ఫంక్షన్ హాల్‌లో జరుగుతుందని టీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులు దేవి రవీందర్, గజ్వేల్ ఎంపీపీ అమరావతి మాట్లాడుతూ ఉదయం 10-30కు జరిగే కార్యక్రమానికి గజ్వేల్ నియోజక వర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీలు, సర్పంచ్‌లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీలు సుధాకర్ రెడ్డి, మల్లేశం, మండల పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, దుర్గయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, నాయకులు పండారి రవీందర్ రావు, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ, కొట్టాల యాదగిరి, చిన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...