క్వింటాలు మక్కలు@ రూ. 1,870


Mon,November 4, 2019 11:01 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఓ రైతు తెచ్చిన మక్కలకు ఒక క్వింటాళుకు రూ.1,870ల అత్యధిక ధర పలికింది. పట్టణంలో బహిరంగ కొనుగోళ్లను నిషేధించి మార్కెట్‌లోనే ట్రేడర్లు కొనుగోళ్లు చేయాలనే నిబంధన తేవడంతో ట్రేడర్లు మార్కెట్‌కు వచ్చిన మక్కలను వేలం పాట ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వేలం పాటలో ఇప్పటి వరకు అత్యధికంగా క్వింటాలుకు రూ.1,830లు దాటలేదు. కానీ సోమవారం చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన సమ్మయ్య అనే రైతు మార్కెట్‌కు తెచ్చిన మక్కలకు అత్యధికంగా రూ.1,870లు పలకడం విశేషం. ఈ మధ్య కాలంలో మక్కలకు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు, రైతులు అంటున్నారు. సదరు రైతు తెచ్చిన మక్కలు నాణ్యతగా ఉండటంతో పాటు బాగా ఎండబెట్టి తెచ్చినందుకే అధిక ధర పలికిందని వారు చెప్తున్నారు. బయట మార్కెట్‌లో మక్కలకు భారీగా డిమాండ్ ఉండటంతో ట్రేడర్లు ప్రభుత్వ మద్దతు ధర రూ.1,760ల కంటే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్‌లో మక్కల దిగుబడి తగ్గడం, డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల క్వింటాలు ధర రూ.2వేలు దాటే అవకాశం కూడా ఉన్నట్లు పలువురు వ్యాపారులు అంటున్నారు. మార్కెట్‌కు వచ్చిన మక్కలను ట్రేడర్లు వేలం పాట ద్వారా మొత్తం కొనుగోలు చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...