దేశంలో కృత్రిమ గర్భధారణలో మొదటి స్థానంలో తెలంగాణ


Mon,November 4, 2019 11:01 PM

గజ్వేల్ రూరల్: దేశంలో పశువుల కృత్రిమ గర్భధారణలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో మంజువాణి అన్నారు. సోమవారం గజ్వేల్ మండలం బయ్యారం గ్రామంలో ఉచిత కృత్రిమ గర్భధారణ శిబిరం, పాడిరైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సీఈవో మంజువాణి గతంలో లబ్ధిపొందిన రైతులతో మాట్లాడారు. కృత్రిమ గర్భధారణ వల్ల పుట్టిన పశువులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో రైతులనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్, కృషి కల్యాణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉచిత కృత్రిమ గర్భధారణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో 100 గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో మొదటి 200ల పాడి పశువులకు కృత్రిమ గర్భధారణ చికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. పుట్టే పశువులు కూడా బలంగా, అధికంగా పాలను ఇచ్చేవిగా ఉండడానికి కరీంనగర్‌లోని డెయిరీ ఫాంల నుంచి ఉత్తమ జాతి వీర్యాన్ని సేకరించి తీసుకువస్తున్నట్లు తెలిపారు. కేవలం ఆడ జీవాలు జన్మించేలా వీర్యాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు పాడి రైతులంతా ప్రతి పశువుకు ట్యాగింగ్ తప్పనిసరిగా చేయించాలన్నారు.

ట్యాగింగ్ ద్వారా ఆ పశువు పూర్తి వివరాలతో పాటు యజమాని వివరాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు అన్ని నూతన పద్ధతులను, వసతులను అందుబాటులోకి తీసుకువస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని పశుసంపద పెరిగేలా కృషి చేయాలన్నారు. రైతులు, అధికారులు పరస్పరం సహకరించుకుని పశుసందను పెంచడంలో విజయం సాధించాలన్నారు. కాగా దేశంలో ఎక్కడా లేని విధంగా గోపాల మిత్రలకు తెలంగాణ రాష్ట్రంలో జీతాలు పెంచారన్నారు. పాడిరైతులకు,పశువులకు ఎల్లవేళలా సేవలందిస్తున్న గోపాల మిత్రలకు సీఎం కేసీఆర్ రూ.8500లకు వేతనాన్ని పెంచారన్నారు.

పాడిరైతులకు పశువుల దాణాకు అవసరమైన పదార్థాలను పంపిణీ చేశారు. బయ్యారం గ్రామంలో పశువులకు, పాడిరైతులకు ఉత్తమ సేవలందిస్తున్న గౌరీశంకర్‌ను, సూపర్‌వైజర్ షాదుల్లా, వైద్యులు సురేశ్,ఆశారాణిలను, పశుపోషణను చక్కగా నిర్వహిస్తున్న పాడిరైతులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అమరావతి శ్యాం మనోహర్, జడ్పీటీసీ పంగ మల్లేశం, సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ అనురాధ, పశుసంవర్ధక శాఖ గజ్వేల్ ఏడీ వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆశారాణి, సురేశ్, గోపాల మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, సూపర్ వైజర్ షాదుల్లా, గోపాల మిత్రలు, రైతులు పాల్గొన్నారు

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...