మల్లన్నను దర్శించుకున్న అడిషనల్ డీసీపీ


Mon,November 4, 2019 11:00 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని సోమవారం సిద్దిపేట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన లాఅండ్‌ఆర్డర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నర్సింహారెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అడిషనల్ డీసీపీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అడిషనల్ డీసీపీ దంపతులకు స్వామి వారి ప్రసాదాలు, మెమోంటో అందజేసి ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, కొమురవెల్లి ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి తదితరులున్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...