ప్రజావాణికి 74 దరఖాస్తులు


Mon,November 4, 2019 11:00 PM

- కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అందించిన దరఖాస్తులను శాఖల వారిగా విభజించి వారికి పంపించామని తెలిపారు. ఆయా శాఖల అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. మొత్తం 74 దరఖాస్తులను స్వీకరించామన్నారు. ఈ ప్రజావాణిలో డీఆర్‌వో చంద్రశేఖర్‌తో పాటు జిల్లా అధికారులు డీపీవో సురేశ్‌బాబు, మత్స్యశాఖ అధికారి వెంకయ్య, చరణ్‌దాస్, డీఎంహెచ్‌వో విజయరాణి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...