వానలతో ఆగమాగం..


Sun,November 3, 2019 11:17 PM

మద్దూరు: కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వివిధ పంటలు దెబ్బతినడంతో మండల రైతాంగం ఆందోళనకు గురవుతున్నది. అకాల వర్షాలకు చేతికందే సమయంలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలోని 21 రెవెన్యూ గ్రామాల పరిధిలో రైతులు వరి- 2,561, పత్తి- 4,786, మొక్కజొన్న-2,168, కంది-640 హెక్టార్లలో సాగు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు సగానికి పైగా నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సాగు సమయంలో ముఖం చాటేసిన వరుణుడు ఇపుడు అధికంగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అన్న బెంగ మండల రైతాంగంలో నెలకొంది. ముఖ్యంగా వరి, కంది పంటలు వర్షాలకు పూర్తి స్థాయిలో నేలకొరిగాయి. పత్తి పంట వర్షాలకు నలుపు ఎక్కడంతో పాటు వర్షం నీరు చేరి పత్తి చేనులు దెబ్బతిన్నాయి. తడిసిన మక్కలు, పత్తిని ఆరబెట్టేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంట నీట మునిగి మొక్కజొన్న కంకులు మొలకెత్తుతున్నాయి. కాగా నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేయడంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. వర్షాల దాటికి నష్టపోయిన పంటలను వెంటనే సర్వే చేయాలని రైతులు కోరుతున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...