మిరుదొడ్డి : మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేస్తున్నారని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. సోమవారం చెప్యాల గ్రామంలోని చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను వదిలారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, మత్స్య కారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.