జిల్లాలో సరాసరిగా 29.3 మి.మీ వర్షపాతం


Mon,October 21, 2019 11:25 PM

-అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 79.6 మి.మీ
-అత్యల్పంగా వర్గల్ మండలంలో 1.7 మి.మీ

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో పలు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు జలకళ వచ్చింది. పలు గ్రామాల్లోని చెరువులు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతూ నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సరాసరిగా 29.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హుస్నాబాద్ మండలంలో 79.6 మి.మీ, అత్యల్పంగా వర్గల్ మండలంలో 1.7 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట అర్బన్ మండలంలో 38.5 మి.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 32.8 మి.మీ, నారాయణరావుపేటలో 9.5 మి.మీ, నంగునూరులో 39.9 మి.మీ, చిన్నకోడూరులో 19.1 మి.మీ, తొగుటలో 13.8 మి.మీ, దౌల్తాబాద్‌లో 9.7 మి.మీ, మిరుదొడ్డిలో 24.9 మి.మీ, దుబ్బాకలో 28.8 మి.మీ, చేర్యాలలో 36.4 మి.మీ, కొమురవెల్లిలో 54.3 మి.మీ, గజ్వేల్‌లో 18.8 మి.మీ, కొండపాకలో 28.3 మి.మీ, జగదేవ్‌పూర్‌లో 22.0 మి.మీ, మర్కూక్‌లో 35.6 మి.మీ, రాయపోల్‌లో 6.6 మి.మీ, అక్కన్నపేటలో 25.7 మి.మీ, కోహెడలో 70.1 మి.మీ, బెజ్జంకిలో 31.8 మి.మీ, మద్దూరులో 45.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
చేర్యాలలో 56.2 మిల్లిమీటర్ల వర్షం

చేర్యాల, నమస్తే తెలంగాణ : పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి ఉధృతంగా పడుతుండడంతో పట్టణంలో జనగామ-సిద్దిపేట ప్రదాన రహదారిపై మత్తడి నీళ్లు ఏరులై పారుతున్నాయి.ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు 56.2మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. గోదావరి జలాలతో పెద్ద చెరువు నిండి మత్తడి పడుతున్న క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో గోదావరి జలాలకు వాన నీళ్లు తోడవ్వడంతో మత్తడి నీళ్లు పట్టణంలోని బీటీ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేరకు ప్రవహించి, అక్కడి నుంచి కుడి చెరువులోకి చేరుకోవడంతో కుడి చెరువు సైతం మత్తడి పడుతున్నది. పట్టణంలోని చెన్నకేశవ ఆలయ గోడ భారీ వర్షంతో కూలిపోయింది. గోడ కూలిన సమయంలో ఆలయం వద్ద ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మండలంలోని వేచరేణి గ్రామంలోని పలు వార్డులలోని ఇండ్లల్లోకి వరద నీరు చేరింది.అలాగే మండలంలోని 12 పెద్ద చెరువులు, 68 చిన్న చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండినట్లు ఐబీ అధికారులు తెలిపారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...