చెక్‌డ్యాంలతో మెట్టకు నీళ్లు


Sun,October 20, 2019 11:42 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : చెక్‌డ్యాం నిర్మాణా లతో మెట్ట ప్రాంతాలకు జలకళ వస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. కోహెడ మండలం పోరెడ్డిపల్లి గ్రామ శివారులో నిర్మించిన చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జిని ఆదివారం మంత్రి హరీశ్‌రావుతో కలిసి సందర్శించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతాలైన హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట లాంటి ప్రాంతాల్లో చెక్‌డ్యాం నిర్మాణాలతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రతి వర్షం చినుకును ఒడిసి పట్టి భూమిలోకి ఇం కించడం ద్వారా భూగర్భ జలాలను పెంచాలనే లక్ష్యంతోనే వాగులపై చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రూ.13కోట్లతో పోరెడ్డిపల్లి చెక్‌డ్యాం కడ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందన్నారు. దీని వల్ల పోరెడ్డిపల్లితో పాటు బస్వాపూర్, నాగసముద్రాల, వెంకటేశ్వరపల్లి, కోహెడ గ్రామాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సాగునీటి శాశ్వత పరిష్కారం కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

-మంత్రి, ఎమ్మెల్యే కృషితోనే చెక్‌డ్యాం : పాతూరి
పోరెడ్డిపల్లి గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కృషి ఎంతో ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. తాను, గ్రామస్తులు చేసిన విజ్ఞప్తికి స్పందించిన మంత్రి.. చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.13కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేసి ఆయనే చెక్‌డ్యాంను ప్రారంభించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, వైస్ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్, ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...