దుబ్బాక పట్టణానికి పచ్చలహారం


Sun,October 20, 2019 11:41 PM

దుబ్బాక టౌన్ : దుబ్బాక మున్సిపాలిటీలో ఐదో విడుత హరితహారంలో విజయవంతంగా మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి పండ్లు, పూల మొక్కలను అందజేయడంతో పాటు వాటి సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. నాటిన ప్రతి మొ క్కను రక్షించాలన్న ఉద్దేశంతో ప్రణాళికను పక్కాగా అమలు చే యడంతో సత్ఫలితాలను ఇస్తున్నాయి. దుబ్బాకతో పాటు లచ్చపేట, ధర్మాజీపేట, దుంపలపల్లి, చేర్వాపూర్, చె ల్లాపూర్, మల్లాయిపల్లి గ్రామాల్లో తొలి విడుత హరితహారంలో 1.10 లక్షలు, రెండో విడుతలో 52 వేలు, మూడో విడుతలో 38 వేలు, నాలుగో విడుతలో లక్షా 98 వేలు , ఐదో విడుతలో లక్షా 26 వేల మొక్కలు నాటారు. మున్సిపాలిటీ సమీపంలో ఉన్న మల్లాయిపల్లి అటవీ ప్రాంతంలో ప్ర ధాన రహదారులు, అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటడంతో అవి ఏపుగా పెరుగుతూ పచ్చదనాన్ని పంచుతున్నాయి. అదేవిధం గా పండ్లు, పూల మొక్కలను ఇండ్లలో నాటేందుకు మున్సిపల్ సిబ్బంది ఇండ్ల యజమానులకు అందజేశారు. వన నర్సరీలు, ఈజీఎస్ నర్సరీల్లో పెంచిన 24 రకాల మొక్కలను అధికారులు పంపిణీ చేశారు.

నీడనిస్తున్న చెట్లు..
గత నాలుగు విడుతల్లో హరితహారం కింద నాటిన మొ క్కలు ఇప్పటికే ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. దుబ్బాక బైపాస్ రోడ్డు, బాలాజీ దేవాలయం వద్ద నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి కొత్త అందాన్ని ఇస్తున్నాయి. ఎమ్మెల్యే రామలింగారెడ్డి తీసుకు న్న ప్రత్యేక కృషితో బైపాస్ రోడ్డులో పెరిగిన చెట్లు పట్టణానికే పచ్చనిహారంలా మారింది. ఇక దుబ్బాక నుంచి చీకోడ్ రోడ్డులో, లచ్చపేట నుంచి చౌదర్‌పల్లి రోడ్డుకు, అదేవిధంగా హబ్షీపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లాయిపల్లి, ధర్మాజీపేట రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఏపుగా పెరుగుతున్నాయి. దుబ్బాకలో నిర్మిస్తున్న వెయ్యి డబుల్‌బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద గత నెలలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఐదో విడుతలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...