మాధవికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అభినందన


Sun,October 20, 2019 11:41 PM

తొగుట : జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన మండలంలోని గుడికందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సీహెచ్ మాధవిని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు స న్మానించారు. హుజూర్‌నగర్‌లో జరిగిన అండర్ 17 రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాధవి వచ్చే నెల 19 నుంచి 22 వరకు కర్ణాటకలోని మాండ్యాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రం నుంచి మాధవి ్ర పాతినిధ్యం వహించనుంది. సిద్దిపేటలోని టీటీసీ భవనంలో ఆదివారం జరిగిన యోగా పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, జడ్పీ చైర్మన్ రోజాశర్మ మాధవిని సన్మానించడంతో పాటు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించా రు. కార్యక్రమంలో ఎంఈవో సత్తు యాదవరెడ్డి, హెచ్‌ఎం అంజలి, వ్యాయామ ఉపాధ్యాయులు హరికిషన్ ఉన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...