పరిశ్రమలతో ఉపాధి


Sun,October 20, 2019 11:41 PM

సిద్దిపేట అర్బన్ : పెరుగుతున్న అవసరాలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే... పారిశ్రామీకరణ అవసరమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట ప్రాంతంలోని 322 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు, ఇక్కడకి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో రూ. 17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణా నికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో సిద్దిపేట ప్రాం తంలో పరిశ్రమల ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మందపల్లి శివారులో ఏర్పాటైన డీఎక్స్‌ఎన్ కంపెనీలో ఉత్పత్తులు ప్రారంభమవుతాయన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అంబిక అగర్‌బత్తీల కంపెనీని సిద్దిపేటలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశానని, త్వరలోనే పరిశ్రమ ఏర్పాటు కాబోతుందన్నారు. మిట్టపల్లిలో మెడికల్ కళాశాలతోపాటు పరిశ్రమలు వస్తుండడంతో రోడ్డు నిర్మిస్తున్నట్లు వివరించారు.

100 ఫీట్ల రోడ్డుతోపాటు బట్టర్‌ైఫ్లె లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 100 రోజు ల్లో రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు 8 ఎకరాల 14 గుంటల భూములు ఇచ్చిన రైతులకు రూ.కోటీ 25 లక్షల చెక్కు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, ఇండస్ట్రియల్ సీఈ శ్యాంసుందర్, జోనల్ మేనేజర్ మాధవి, జిల్లా మేనేజర్ శివప్రసాద్, మేనేజర్ విజయ, జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, రైతు సమన్వయ సమితి జిల్లా చైర్మన్ నాగిరెడ్డి, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పీఏసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, పయ్యావుల రాములు, సంతోశ్‌యాదవ్, సిద్దరబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...