బంద్ ప్రశాంతం..


Sat,October 19, 2019 11:25 PM

గజ్వేల్, హుస్నాబాద్,నమస్తే తెలంగాణ/సిద్దిపేట టౌన్/దుబ్బాక టౌన్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతున్నది. కార్మిక జేఏసీ పిలుపు తో శనివారం జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. దుకాణాలు, వాణిజ్యసంస్థలు మూతబడ్డాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. బంద్‌కు పలు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పలువురు నాయకులు, కార్యకర్తలను, కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్‌లో దుకాణాలు,ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడంతో ప్రైవేటు వాహనాలు బాగా నడిచాయి. హుస్నాబాద్‌లో డిపో రోడ్డు నుంచి గాంధీచౌక్ ద్వారా మల్లెచెట్టు చౌరస్తా వరకు ర్యాలీగా వస్తున్న ఆర్టీసీకార్మికులు, వివిధ పార్టీల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో ప్రయాణికులు పెద్దగా కనిపించలేదు. బంద్ సందర్భంగా హుస్నాబాద్ డివిజన్‌లో 146మందిని ముందు జాగ్రత్తగా అరెస్టు చేసినట్లు ఏసీపీ మహేందర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా నాలుగు డిపోల పరిధిలో 38 బస్సులు, సీసీ బస్సులు 24, ఈఐబీఎస్ 13, మ్యాక్స్‌క్యాబ్ 80 ఆయా రూట్లలో నడిచాయి.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...