టీఆర్‌ఎస్ నాయకుడు మృతి


Sat,October 19, 2019 11:24 PM

రామాయంపేట: గుండె పోటుతో టీఆర్‌ఎస్ నాయకుడు మృతిచెందాడు. నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన బుచ్చ దుర్గయ్య(55) శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రామాయంపేట దవాఖానకు తరలించి చికిత్సను నిర్వహించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అయినా కూడా పరిస్థితి చేయిదాటి పోవడంతో వెంటనే హైదరాబాద్‌కు ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దుర్గయ్య మృతి విషయం తెలుసుకున్న మిత్రులు అంత్యక్రియలలో పాల్గొన్నారు.
దుర్గయ్య మృతి బాధాకరమని నిజాంపేట మండల రైతు సమన్వయ సమితీ చైర్మన్, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, రామాయంపేట మాజీ జెడ్పీటీసీ విజయలక్ష్మిలు అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీటీసీ సురేశ్, గ్రామ సర్పంచ్ లద్ద ప్రీతి రాజగోపాల్, టీఆర్‌ఎస్ నాయకులు మాజీ సర్పంచులు సంగు స్వామి, ఆకుల బాలయ్య, బ్రహ్మంచారి తదితరులు అంత్యక్రియలలో పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చేగుంట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చేగుంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ గ్రామానికి చెందిన చాకలి సత్తయ్య(55)అతని భార్య ద్విచక్ర వాహనంపై చేగుంట నుంచి రామంతాపూర్ గ్రామానికి వెళ్తుండగా వడియారం బైపాస్ రోడ్డులో వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో సత్తయ్య అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టు మార్టం నిమిత్తం మెదక్ ఏరియా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

యువకుడికి తీవ్ర గాయాలు
చేగుంట: రోడ్డు ప్రమాదం లో యువకుడుకి తీవ్ర గాయలైన ఘటన రెడ్డిపల్లి చె రువు కట్ట సమీపంలో శనివారం చోటు చేసుకుం ది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిపల్లి కాలనీకి చెందిన మంద ప్రశాంత్ చేగుంట నుంచి రెడ్డిపల్లిలోని హనుమాన్ ఆలయంకు వెళ్తుండగా ఎదురుగా బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మంద ప్రశాంత్‌కు కాలు, చేతులు విరిగి పోయాయి. గాయపడిన ప్రశాంత్‌కు చేగుంట దవాఖానలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ దవాఖానకు తరలించారు. ఇట్టి విషయమై చేగుంట పోలీసులుకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...