లక్కు దక్కింది.. టెన్షన్ వీడింది


Fri,October 18, 2019 11:07 PM

-లక్కీడ్రా ప్రారంభించిన కలెక్టర్
-తేలిన మద్యం వ్యాపారుల భవితవ్యం
-70 మందిని వరించిన అదృష్టం
-10 దుకాణాలు దక్కించుకున్న మహిళలు
-సందడి మారిన రెడ్డి సంక్షేమ భవన్
-మద్యం దుకాణం దక్కిన వారిలో ఆనందం
-నిరాశతో వెనుదిరిగిన ఆశావహులు

సిద్దిపేట టౌన్ : మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు లక్కును పరీక్షించుకున్నారు. మూడు రోజులుగా దరఖాస్తుదారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలో 70 మద్యం దుకాణాలకు ఈ యేడాది 1336 దరఖాస్తులు వచ్చాయి. వస్తే లక్కు.. కిక్కు.. పోతే రూ.2 లక్షలు అనే ధైర్యం తో టెండర్లు వేశారు. మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియకు సిద్దిపేటలో రెడ్డి సంక్షేమ భవన్ వేదికైంది. శుక్రవారం మద్యం లక్కీ డ్రాను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గెజిట్ నంబరు ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిని వేదికపైకి పిలిచి డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. డ్రాలో మద్యం దుకాణాలు వచ్చిన వారికి అక్కడికక్కడే అనుమతి పత్రాలు అందించారు. లక్కీ డ్రాను పూర్తిగా పారదర్శకంగా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, డీఆర్‌వో చంద్రశేఖర్ నిర్వహించారు. సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అంజిరెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షణ జరిపారు. మద్యం టెండర్ల లో జిల్లావ్యాప్తంగా 152 మంది మహిళలు తమ పేర్ల మీద టెండర్లు వేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అనూహ్యంగా 10 మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు.

-సందడిగా రెడ్డి సంక్షేమ భవన్
మద్యం దుకాణాల ఏర్పాటు కోసం టెండర్లు వేసిన ఆశావహులు కుటుంబ సభ్యులు, స్నేహితులతోకలిసి భారీగా తరలివచ్చారు. సుమారు కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచాయి. ఎక్కడ చూసిన ఆశావహులే కనబడ్డారు. దీంతో రెడ్డి సంక్షేమ భవన్, రంగధాంపల్లి రాజీవ్ రహదారి సందడిగా మారింది. గెజిట్ ప్రకారం మద్యం దుకాణదారులను అధికారులు పిలిచారు. మద్యం షాపుల డ్రాను ఎక్సైజ్ శాఖ పూర్తిగా వీడియోను చిత్రీకరించింది. మద్యం దుకాణం దక్కించుకున్న వారికి పత్రాలు అందించి బ్యాంకు నుంచి డీడీలను స్వీకరించారు. వాయిదా ఫీజు 1/8గా చెల్లించారు. డ్రాలో విజేతలైన వారి పూర్తి ఆధారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

-మహిళలను వరించిన లక్కు
ఈ ఏడాది మద్యం టెండర్లలో మహిళలు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేశారు. కొందరు తమ కుటుంబ మహిళల పేర్ల మీద టెండర్లను వేయించి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2017లో జరిగిన టెండర్లలో 6 మందికి లక్కు కలిసి రాగా, ఈ సారి 10 మంది మహిళలను అదృష్టం వరించింది. తాము ఎందులో తక్కువ కాదని మరోసారి చాటారు. లక్కీడ్రా దక్క డంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

-కొమురవెల్లి వైన్స్‌ను దక్కించుకున్న నర్సింహారెడ్డి
ఎక్సైజ్ టెండర్లలో అందరి దృష్టి కొమురవెల్లి వైన్స్ పైనే. ఈ దుకాణాన్ని చేజిక్కించుకోవాలని 69 మంది టెండర్లు వేశా రు. దీంతో అందరి దృష్టి కొమురవెల్లి వైన్స్ పైనే పడింది. 69 దుకాణాలు ఒక ఎత్తు కాగా కొమురవెల్లి వైన్స్ ఒక ఎత్తుగా మారింది. అందరి దృష్టి ఈ దుకాణంపైనే కేంద్రీకరించారు. లాటరీలో నర్సింహారెడ్డిని లక్కు వరించింది. అదే విధంగా కుకునూరుపల్లికి 47, నంగునూరుకు 44 దరఖాస్తులు రావ డంతో తీవ్ర పోటీ నెలకొంది. పోటీలో నంగునూరు వైన్స్‌ను వేముల వెంకట్‌రెడ్డి, కుకునూరుపల్లి వైన్స్‌ను మల్లయ్య అనే వ్యక్తి డ్రాలో గెలుపొందాడు. గెజిట్ నంబరు 21,38,53,48 దుకాణాలకు భారీసంఖ్యలో టెండర్లు వేశారు. అధికంగా పురుషులే వైన్స్‌లు దక్కించుకున్నారు. అయితే, 53 గెజిట్ నంబరు దుకాణాన్ని మాత్రం రేఖ అనే మహిళకు వచ్చింది.

-నిరాశగా వెనుదిరిగిన ఆశావహులు
గతంలో ఎప్పుడూ లేని వధంగా ఈ సారి మద్యం దుకాణాల టెండర్లకు తీవ్ర పోటీ నెలకొంది. సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 70 దుకాణాలకు మొత్తం 1336 దరఖాస్తులు రావడంతో పోటీ పదింతలకు పెరిగింది. దీంతో లక్కీ డ్రా ఆసాంతం తీవ్ర ఉత్కంఠగా సాగింది. వీరిలో 70 మంది ని అదృష్టం వరించింది. మిగతా వారందరు నిరాశతో వెనుదిరిగారు. డ్రాలో విజేతలైన వారు కుటుంబ సభ్యులతో సం బురాలు చేసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతించారు. దీంతో డ్రా ప్రశాంతంగా ముగిసింది.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles