ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక


Fri,October 18, 2019 10:46 PM

అక్కన్నపేట : మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో కొప్పుల సత్యపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండంలోని కట్కూర్, అంతకపేట, చౌటపల్లి, మల్లంపల్లి తదితర గ్రామాల్లో డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు కోసం 15 గుంటలు, శ్మశానవాటిక కోసం 20 గుంటల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు. కాగా, క్షేత్ర స్థాయిలో స్థలాల పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు కొత్త గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపట్టే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆ స్థలాలను కూడా పరిశీలన చేశామన్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రగతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం 30 రోజులు ప్రణాళిక కొనసాగించి ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ ఉదయభాస్కర్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు జిల్లెల అశోక్‌రెడ్డి, ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles