ప్రణాళిక బాట.. మీనాజిపేట


Fri,October 18, 2019 10:45 PM

వర్గల్ : మండలంలోని మీనాజిపేట గ్రామం స్వచ్ఛబాటలో ముందుకు సాగుతున్నది. సీఎం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రగతి కార్యాచరణ పనులతో గ్రామం రూపురేఖలే మారాయి. పాడుబడిన బావులు, పాత ఇండ్లు కనబడకుండా పోయాయి. పారుశుధ్య నిర్మూలనకు గ్రామస్తులు నడుం బిగించారు. గ్రామంలోని ప్రధాన బజారులన్నీ చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా మారాయి. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించారు. హరితహారంలో భాగంగా మొక్కల పెంపకంపై ప్రచారం నిర్వహించారు. నాటిన ప్రతీ మొక్క బతికుండేలా సంరక్షణ చర్యలను వివరించారు. గ్రామస్తులందరూ ఏకమై మీనాజిపేట రూపురేఖలనే మార్చేశారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles