సబ్సిడీ శనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి


Fri,October 18, 2019 10:45 PM

వర్గల్ / జగదేవపూర్ : యాసంగి ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఆరుతడి పంటసాగును బలోపేతం చేసేందుకు యాసంగిలో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను అందజేస్తున్నదని వర్గల్ వ్యవసాయాధికారి సక్లేశ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆగ్రోరైతు సేవా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సబ్సిడీపై అందజేస్తున్న శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకొని మంచి లాభాలు గడించాలని సూచించారు. కాగా మొదటి విడతలో భాగంగా 200 బ్యాగులు మాత్రమే వచ్చాయని అవసరాన్ని బట్టి మరింత స్టాక్ తీసుకొస్తామని తెలిపారు. ఒక్కో కిలోకు రూ.18 సబ్సిడీ ఉంటుందన్నారు. రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్‌లు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఈవోలు అనిత, సంపత్, లక్ష్మణ్, ధర్మేందర్ పాల్గొన్నారు.

అందుబాటులో రాయితీపై శనగ విత్తనాలు..
రైతులకు అవసరమైన శనగ విత్తనాలు ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు రాయితీపై అందిస్తుందని మండల వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మండల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 1200 ఎకరాల విస్తర్ణం శనగ పంట వేసేందుకు అనుకూలంగా ఉన్నదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు 800 శనగ బ్యాగులు (25kg) అందుబాటులో ఉంచిందన్నారు. వాటి ధర క్వింటాలుకు రూ.6500లు ఉండగా ప్రభుత్వం రూ.2275లు రాయితీ ఇస్తున్నదన్నారు. శనగ పంట వేయాలనుకునే రైతులు తమ పట్టాపుస్తకంతో ఏఈవోలను సంప్రదించి పర్మిట్ తీసుకొని అగ్రోస్ కేంద్రంలో 25కేజీ బ్యాగుకు రూ.1056 చెల్లించి తీసుకోవాలని సూచించారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles