ఆలయ నిర్మాణానికి భూమి పూజ


Fri,October 18, 2019 10:45 PM

గజ్వేల్ రూరల్ : గజ్వేల్ పట్టణంలోని అతిపురాతన సీతారామ ఉమామహేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన కవాపకర్షణ పూజా కార్యక్రమాలు శుక్రవారంతో ముగిసాయి. పూజా కార్యక్రమాల్లో భాగంగా సహస్ర అఘోర, గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలను బోదన్‌కు చెందిన గంగవరం నారాయణశర్మ వైదిక నిర్వహణలో రుత్వికులు ఎంతో నిష్టగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కాల్వల శ్రీధర్‌రావు, ధర్మకర్తలు రుక్మాభట్ల కృష్ణమూర్తి, దేశపతి రాజశేఖర శర్మ రుత్వికులు, వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహింపజేశారు. ప్రస్తుత ఆలయ వెనుక భాగంలో భూమిపూజ నిర్వహించి నాగలితో కర్ణణము, బీజావాపనము నిర్వహించారు. అలాగే దేవాలయ కవాపకర్షణము, నిర్వహించి దేవతలను కలశాల్లోకి ఆవాహన చేశారు. సీతారాములు, అళ్వారులు, ఉమామహేశ్వర, శివగణా దేవతామూర్తులను దేవతా మూర్తులను వేదమంత్రాలు, భాజాభజంత్రీలతో తీసుకువెళ్లి బాల ఆలయాలలో భద్రపరిచి పూజ కలశ దేవతలకు, ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు చారి, ఆలయాల పూజారులు ఉమ్మయ్య, శివకుమార్, విజయ్, నవీన్, రుత్వికులు, రామశర్మ, కృష్ణమూర్తి శర్మ, విఠాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles