ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్సంక్షేమ భవన్ నిర్మాణానికి కృషి


Thu,October 17, 2019 11:31 PM

కలెక్టరేట్,నమస్తే తెలంగాణ : సిద్దిపేటలో త్వరలోనే ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ భవన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని ఆర్ధిక శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని మంత్రి నివాసంలో గురువారం ఉదయం జిల్లా ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంఘం రాష్ట్ర, జిల్లా మండలాల నాయకులు మంత్రి హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి నోట్ పుస్తకాలు, తువ్వాలలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫొటోఫ్రీ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హమీ మేరకు త్వరలోనే స్థల సేరకణ చేసి నిధులు మంజారు చేస్తామని తెలిపారు. దీంతో మంత్రి హరీశ్ రావుకు ఫొటో, వీడియో గ్రాఫర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, జిమ్మి శేఖర్, పరీద్,కోటి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావుకు కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి
ప్రతి నెల వేతనాలు ఇచ్చి, తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం సభ్యులు గురువారం సిద్దిపేటలోఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈమేరకు మంత్రి హరీశ్‌రావు సానుకులంగా స్పదించి నెల నెలా వేతనాలు చెల్లించేందుకు ఉన్నతాధికారులను ఆదేశిస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి సానుకులంగా స్పదించిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు కనకచంద్రం, కార్యదర్శులు సిద్ధ్దారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నాగేందర్, అశోక్, రవి, నగేశ్ పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...