నేడు మల్లన్న ఆలయంలో వేలం పాట


Thu,October 17, 2019 11:31 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు విక్రయించుకునే హక్కులు పొందేందుకు ఈ నెల 18వ తేదీన సీల్డు టెండరు-కమ్- బహిరంగ వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ దేవాలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు విక్రయించుకునేందుకు ఆసక్తిగల వ్యాపారులు రూ.2 లక్షల ధరావత్తు సొమ్మును జాతీయ బ్యాంకులో డీడీ తీసి కార్యాలయంలో అందజేసి వేలం పాటల్లో పాల్గొనాలని సూచించారు. టెండరులో హెచ్చు పాటదారుడు పాటముగిసిన వెంటనే ధరావత్తు సొమ్ము కలుపుకొని 60 శాతం సొమ్ము వెంటనే చెల్లించాలని, మిగతా 40 శాతం డబ్బులు మూడు రోజుల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారుర. లేని పక్షంలో టెండరు రద్దు చేయడంతో పాటు చెల్లించిన సొమ్ము జప్తు చేస్తామన్నారు. ఆయనతో ఏఈవో రావుల సుదర్శన్, పర్యవేక్షకుడు నీల శేఖర్ ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...