వేద ధర్మాన్ని పరిరక్షించేందుకు కృషి


Thu,October 17, 2019 11:30 PM

సిద్దిపేట అర్బన్ : వేదాల పరిరక్షణకు, దేవాలయా ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జి ల్లా కేంద్రం సిద్దిపేటలోని పద్మనాయక కల్యాణ మండపంలో 19వ వార్షికోత్సవ తెలంగాణ వేద విద్వాన్ మహాసభల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హ రీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో తెలంగాణ వే ద విద్వాన్ మహాసభలు జరిపే అవకాశం ఇవ్వడం మా అదృష్టమన్నారు. 4 రోజులు సిద్దిపేట వేద ఘోషతో సుభిక్షమవుతుందన్నారు. వేద పరిరక్షణ కు జనార్దనానంద సరస్వతీస్వామి ట్రస్ట్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. వేదం అభ్యసించిన విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు నిర్వహించి పట్టాలు ఇవ్వడం గొప్పవిషయమన్నారు. వేద ధర్మాన్ని ప రిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. సీఎం కేసీఆర్ స్వ యంగా గొప్ప భక్తుడు..ధార్మిక సేవా తత్పరుడు అన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయుత చండీయాగం నిర్వహించారన్నారు. దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ప్రభుత్వ నిధి(ట్రెజరర్) ద్వారా వేతనాలు ఇస్తున్న ప్ర భుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. టెక్నాల జీ మోజులో పడి వేద ధర్మాన్ని మరువొద్దన్నారు. ధార్మిక, ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీచైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సిద్దిపేట బ్రా హ్మణ పరిషత్ అద్యక్షుడు కోటి రామేశ్వర్‌రావు, ట్రస్ట్ అద్యక్షుడు సాయినాథశర్మ, పాల సా యిరాం, తదితరులు పాల్గొన్నారు. అనంతర వేద విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...