అభివృద్ధ్ది పనులపై మంత్రి సమీక్ష


Thu,October 17, 2019 11:29 PM

సిద్దిపేట అర్బన్ : జిల్లాలో జరుగుతున్న అభివృద్ధ్ది పనులపై కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రాంలింగారెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మతో కలిసి గురువారం రాత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కస్తూర్బా, సంక్షేమ హాస్టళ్లలో చేపట్టాల్సి మరమ్మతులపై నివేదిక పంపాలన్నారు. చలికాలం దృష్ట్యా వేడి నీళ్లకోసం హీటర్లు, ఇందుకు అవసరమయ్యే కరెంట్ కోసం సోలార్ సిస్టం బిగించాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆకుపచ్చ, ఎరుపు, రంగు చెత్త బుట్టలను పంపిణీ చేయాలన్నారు. అలాగే, చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఆటోలు, చెత్త క్లీనింగ్ యంత్రాల కొనుగోళ్లకు నిధులు కేటాయించారు. సమీక్షలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...