70 దుకాణాలు 1336 దరఖాస్తులు


Thu,October 17, 2019 12:14 AM

-జిల్లాలో మద్యం దుకాణాలకు తీవ్ర పోటీ
-ముగిసిన దరఖాస్తుల స్వీకరణ
-టెండర్లు వేసిన 101 మంది మహిళలు

సిద్దిపేట టౌన్ : ప్రభుత్వం నూతనంగా రూ పొందించిన మద్యం పాలసీకి అనూహ్య స్పందన వచ్చింది. మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఆశావహులు పోటెత్తారు. ఈ నెల 9న ప్రారంభమైన మద్యం టెండర్ల ప్రక్రియ మెలమెల్లగా పుంజుకుంది. రెండు రోజులుగా దరఖాస్తులు ఆమాంతం పెరిగాయి. మంగళవారం నాటికి 500 పైచిలుకు ఉన్న దరఖాస్తులు బుధవారం నాటికి 1336 మంది టెండర్లను సమర్పించారు. చివరి రోజు ఏకంగా 800 పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2017 టెండర్లలో సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 1044 దరఖాస్తులు పడ్డాయి. ఏకంగా రూ.26కోట్ల20లక్షల ఆదాయం ప్రభుత్వం గడించింది.

జిల్లాలో ఐదు ఎక్సైజ్ సర్కిళ్లు
సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఐదు సర్కిల్ పరిధిలున్నాయి. సిద్దిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 21 మద్యం దుకాణాలు, గజ్వేల్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19, హుస్నాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 13, చేర్యాల ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 11, మిరుదొడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 6 మొత్తం 70 దుకాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా సర్కిళ్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాల ఏర్పాటు కోసం 1310 దరఖాస్తులను అందించారు. 2019 నవంబర్ 1 నుంచి నూతన మ ద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ టెండర్లు 2021 అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయి.

కొమురవెల్లి, మద్దూరు వైన్స్‌లకు 62..
మద్యం దుకాణం అంటే లాభసాటి వ్యాపారం. ఎట్టకేలకు మద్యం దుకాణం చిక్కితే లక్కు దక్కినట్లే అని అందరిలో ఉంటుంది. కానీ జిల్లాలో కొన్ని మద్యం దుకాణాలకు పోటాపోటీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. అందులో ముఖ్యంగా కొమురవెల్లి, మద్దూరు మద్యం దుకాణాల కోసం ఏకంగా 62 టెండర్లు పడ్డాయి. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా నంగునూరు 44, కుకునూరుపల్లికి 44, వంటిమామిడికి 40, రాఘవాపూర్ 39, తొగుట 37 ఇలా కొన్ని మద్యం దుకాణాలకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట, గజ్వేల్ పరిధిలో కొన్ని మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఆశావహులు స్వల్పంగానే దరఖాస్తులను అందజేశారు.

టెండర్లు వేసిన 101 మంది మహిళలు
ఈ సారి మహిళలు మద్యం టెండర్లు వేశారు. తాము మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మద్యం వ్యాపారంలోకి దిగారు. మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా టెండర్లు వేసిన సంఖ్యలో వీరు అత్యధికంగా టెండర్లు అం దజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 101 మంది మహిళలు మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులను సమర్పించారు.

ముగిసిన టెండర్ల ప్రక్రియ
మద్యం దుకాణాలు చేజిక్కించుకోవాలని ఆశావహులు భారీగా సిద్దిపేట ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయానికి తరలివచ్చారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దరఖాస్తు కోసం లక్ష రూపాయలు ప్రభుత్వం పెంచింది. దీంతో మద్యం దుకాణదారులు వెనక్కి తగ్గారు. మొదట్లో మెలమెల్లగా వచ్చిన దరఖాస్తులు గత రెండు రోజులుగా ఒకసారిగా పుంజుకున్నాయి. దీంతో ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయం సందడిగా మారింది. వారం రోజుల పాటు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది.

రేపు కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా
సిద్దిపేట రెడ్డి సంక్షేమ భవన్‌లో జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 18న లక్కీడ్రా ద్వారా దుకాణాలను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. లక్కీడ్రాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles