బాధిత కుంటుంబానికి న్యాయం చేయాలి


Wed,October 16, 2019 11:56 PM

మనియార్‌పల్లి తండాకు చెందిన రైతు తుల్జానాయక్ మృతికి రెవెన్యూ అధికారులే కారణమని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానిక రైతులతో పాటు ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట శవాన్ని ఉంచి రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టా పుస్తకాలను మంజూరు చేసి సంవత్సరం గడిచినా ఇంత వరకు రైతుకు ఇవ్వలేదని వారు మండిపడ్డారు. ఎస్‌ఐ రాము సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి వివరాలను సేకరించాడు. గ్రామ శివారులోని సర్వే నం.41లో ఐదు ఎకరాలు తుల్జానాయక్ పేరున ఉన్నది. పాత పుస్తకంలో కూడా పొందుపరిచారు. కానీ కొత్త పట్టా పుస్తకం రైతు చేతికి ఇంత వరకు అందలేదు.

సర్వే నం.41లో 210.2 ఎకరాలున్నది. కానీ 135మంది వద్ద పాత పట్టా పుస్తకాలున్నాయి. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సర్వే చేసి కొత్త పట్టా పుస్తకాలను పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. సర్వే పూర్తి కాకపోవడం, పట్టా పుస్తకం అందకపోవడంతో మనస్తాపం చెందిన రైతుకు గుండెపోటు వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి రూ.20లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం, ఐదు ఎకరాల భూమిని ఇప్పించాలని ఆర్డీవో రమేశ్‌బాబును కోరారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ధర్నాలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ రాందాస్, వైస్ ఎంపీపీ షకీర్ అలీ, ఎంపీటీసీ రత్నం, మాజీ సర్పంచ్ మొగులయ్య, నర్సింహులు, గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్పీ గణపత్ జాదవ్, జహీరాబాద్ పట్టణ సీఐ సైదేశ్వర్ బందోబస్తు నిర్వహించారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...