తహసీల్ కార్యాలయం వద్ద రైతు మృతి


Wed,October 16, 2019 11:56 PM

కోహీర్: పట్టాదారు పాసుపుస్తకాల కోసం వచ్చిన రైతు అనంతలోకాల్లో కలిసి పోయాడు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం సంవత్సరం నుంచి తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనికరం చూపలేదు. పట్టా పుస్తకం రావడం లేదంటూ తనలో తాను బాధపడుతూ తుదిశ్వాస విడిచాడు. ఎస్‌ఐ రాము, స్థానికుల తెలిపిన కథనం ప్రకారం మండలంలోని మనియార్‌పల్లి తండాకు చెందిన తుల్జానాయక్(72) బుధవారం పట్టా పుస్తకాల కోసం కోహీర్ పట్టణంలోని తహసీల్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో నాయబ్ తాసిల్దార్ బస్వరాజును కలిసి తమకు పట్టా పుస్తకాలను ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పందించిన నాయబ్ తాసిల్దార్ సంబంధిత వీఆర్వో రాగానే చెబుతానని అంత వరకు ఒక చోట కూర్చోవాలని రైతుకు తెలిపాడు. రైతు కూడా బయటకు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. కొద్ది సేపటికిపైకి లేవగానే సొమ్మసిల్లిపోయాడు. ఆయన కిందపడడాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే ఆటోలో దవాఖానకు తరలించారు. కానీ తుల్జానాయక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆగ్రహం చెందిన స్థానిక రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...