కోమటి చెరువును సందర్శించిన టూరిజం ఎండీ


Wed,October 16, 2019 11:55 PM

కలెక్టరేట్,నమస్తే తెలంగాణ : రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్ బుధవారం సిద్దిపేటలోని కోమటిచెరువును సందర్శించారు. పర్యాటకశాఖకు చెందిన 25 మంది టూరిజం ఇంజినీర్లతో కలిసి కోమటి చెరువు వద్ద నిర్మిస్తున్న వేలాడే వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) సాంకేతిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటి చెరువులో ఇంజినీర్లతో కలిసి బోటింగ్ చేశారు. అడ్వెంచర్ పార్కు, స్కైసైక్లింగ్‌ను పరిశీలించారు. వారి వెంట టూరిజం ఈడీ సుదర్శన్, ఏఈ సుహాగ్, మేనేజర్ రవీంద్రచారితోపాటు పలువురు ఉన్నారు. కోమటిచెరువు వద్ద మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఎండీ మనోహర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...