అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..అనంతలోకాలకు..


Tue,October 15, 2019 12:36 AM

కంది : బంధువు అంత్యక్రియలకు వెళ్లి తిరుగు పయనమైన ఆ కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఒకే వాహనంలో 19 మంది ప్రయాణిస్తుండగా, ఇందులో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ మరణించగా, మరో 16 మందికి తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్ర పరిధిలోని కులబ్‌గూర్ గ్రామ శివారు సదాశివనగర్ వద్ద చోటు చేసుకున్నది. సంగారెడ్డి రూరల్ సీఐ శివకుమా ర్ తెలిపిన వివరాల ప్రకారం.. పుల్కల్ మండలం చౌ టకూర్ గ్రామానికి చెందిన 19 మంది టాటా ఏస్ వాహనంలో కొండాపూర్ మండలం గొల్లపలి గ్రా మంలో తమ బంధువు అంత్యక్రియల కోసం సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. గొల్లపల్లి గ్రా మంలో అంత్యక్రియలు ముగించుకుని చౌటకూర్ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు.

సంగారెడ్డి మండలం కులబ్‌గూర్ శివారు సదాశివనగర్ వద్ద ఎ దురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును టాటా ఏస్ వా హనం ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు కాగా, వెంటనే పోలీసులు జి ల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనలో చౌటకూర్ గ్రామానికి చెందిన బుచ్చి బా గమ్మ (50), బుచ్చి చంద్రకళ (42)లు చికిత్స పొం దుతూ మృతిచెందారు. మృతులు ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అత్త, కోడలు. మరో 16 మందిలో ము గ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించగా, మిగతా క్షతగ్రాతులకు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు సీఐ వివరించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...