పెద్దగుండవెల్లిలో మద్యపాన నిషేధానికి తీర్మానం


Mon,October 14, 2019 12:48 AM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : మండలంలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో బెల్టు షాపులను తొలిగించాలని కోరుతూ ఆదివారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందుకు సర్పంచ్, వార్డు సభ్యులు, యువజన సంఘాలు మద్దతుగా నిలిచారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో బెల్టు దుకాణాలను నిషేధించేందుకు తీర్మానం చేశారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేపట్టడంతో చాలా మంది మద్యానికి బానిసాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి అనారోగ్యం పాలవటమేగాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తరచూ గొడవలతో గ్రామంలో ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ విషయంపై సర్పంచ్ సద్ది రాజిరెడ్డికి మహిళా సంఘాలు, యువజన సంఘాలవారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మానం చేశామన్నారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు కిరాణ దుకాణాలు, కల్లు దుకాణాల, ఇతర దుకాణ దారులకు ముందస్తుగా నోటీసుల జారీ చేశారు. ఇకముందు గ్రామంలో మద్యం విక్రయిస్తే గ్రామపంచాయతీ తరఫున చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డుసభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు, నేహ్రూ యువజన సంఘం సభ్యులు తదితరులున్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...