మనిషి ఉన్నదాంతో తృప్తి చెందాలి


Mon,October 14, 2019 12:48 AM

సిద్దిపేట టౌన్ : నిత్యం తృప్తి కోసం పరితపించే మనిషి ఉన్నదాంట్లోనే సర్దుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని సుందరచైతన్యానంద స్వామి హితబోధ చేశారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 వరకు జరిగే 238వ గీతా జ్ఞాన యజ్ఞం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామి అమృతోపన్యానాలను వినిపించేందుకు సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు, భక్తులను ఉద్దేశించి సుందరచైతన్యానంద స్వామి మాట్లాడారు. అన్నీ ఉండి కూడా తృప్తి పొం దనివారు లోకంలో ఉన్నారని, నాలుగు వేదాంత మాటలతోనూ తృప్తి పొందవచ్చని చెప్పారు. మనిషి పుట్టినప్పటి నుంచి గిట్టేవరకు ఎన్నో పోగొట్టుకుంటామని తెలిపారు. ముఖ్యంగా కాలం విలువైనదని, క్షణక్షణం మనం మృత్యువుకు దగ్గర అవుతున్నామని, ఉన్న సమయంలోనే పది మందికి సేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచిం చారు. ఏదీ శాశ్వతం కాదని.. మన పనులే మనల్ని చిరస్థాయిలో నిలుపుతాయన్నారు. దైవ నామస్మరణతో మనిషి జీ వితం ధన్యమవుతుందని వివ రించారు. అమృతోపన్యాసనాలతో అందరినీ ఆలోచింపజేసి ఆకట్టుకున్నారు.

స్వామిజీ కార్యక్రమాలు..
238వ గీత జ్ఞాన యజ్ఞం కా ర్యక్రమాన్ని పురస్కరించుకొని స్వామి సుందరచైతన్యానంద సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానం లో స్వామి అమృతోపన్యాసములు ఈ నెల 13 నుంచి 20 వరకు జరుగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 7.30 వరకు ఆదిశంకరుల భజగోవిందం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 వరకు శ్రీమద్బగవద్గీత ప్రసంగం.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...