30 రోజుల ప్రణాళిక.. గ్రామాల పాలిట వరం


Fri,September 20, 2019 11:21 PM

-తొగుట ఎంపీపీ గాంధారి లత
తొగుట : సీఎం కేసీఆర్ పల్లె సీమలకు పూర్వవైభవం తీ సుకరావడానికే 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమం ప్రవేశపెట్టారని ఎంపీపీ గాంధారి లత అన్నారు. శుక్రవారం వెం కట్‌రావుపేటలో మండల ప్రత్యేకాధికారి నాగరాజు, ఎంపీడీవో రాజిరెడ్డి, సర్పంచ్ లీలాదేవి, ఎంపీటీసీ నర్సింహులుతో కలిసి పారిశుధ్య చర్యలను పరిశీలించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉ న్న ఇండ్లను, గోడలను తొలిగించాలన్నారు. పెద్దమాసాన్‌పల్లిలో సర్పంచ్ వరలక్ష్మి, ప్రత్యేకాధికారి మమత ఆధ్వర్యంలో మ హిళలు పారిశుధ్య చర్యలు చేపట్టారు. చందాపూర్‌లో జ రుగుతున్న పనులను గుడికందులలో ఇండ్లలో నిలువ ఉన్న నీ టిని తొలిగించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

విద్యుత్ సమస్యలకు చరమగీతం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో ఎన్నో రోజులుగా గ్రామాల్లో తిష్టవేసుకున్న విద్యుత్ సమస్యలకు చరమగీతం పాడుతున్నామని జిల్లా విద్యుత్ ఎస్‌ఈ కర్ణాకర్‌బాబు పేర్కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని వెంకట్‌రావుపేటలో చేపడుతున్న విద్యుత్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జిల్లాలోని ప్రతి గ్రామంలో వీధి లైట్ల కోసం ప్రత్యేక వైర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న ప్రతి సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రత్యేక మీటర్ బిగిస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిధుల సమస్య లేదన్నారు. కార్యక్రమంలో తుక్కాపూర్ ఏడీఈ జగదీశ్, ఏఈ అనిల్ కుమార్, సర్పంచ్ పాత్కుల లీలాదేవి, ఎంపీటీసీ కంకనాల నర్సింహులు ఉన్నారు.

జోరుగా.. స్వచ్ఛ కార్యక్రమాలు..
దుబ్బాక,నమస్తే తెలంగాణ : సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాద్యమని జడ్పీటీసీ కడతల రవిందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రామక్కపేట, గోసాన్‌పల్లి, రఘోత్తంపల్లి గ్రామాల్లో జడ్పీటీసీ ప్రగతి పనుల్లో పాల్గొన్నారు. పె ద్దగుండవెళ్లి, అప్పనపల్లి గ్రామాల్లో ఎంపీడీవో భా స్కర్‌శర్మ పర్యటించి గ్రామస్తులకు ప్రణాళిక కా ర్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మి, సర్పంచ్‌లు, వా ర్డుసభ్యులు పాల్గొన్నారు.

ప్రగతి సాధిస్తున్న పల్లె సీమలు..
మిరుదొడ్డి : సీఎం కేసీఆర్ ఎంతో దూర దృష్టితో ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న 30 రోజులు పల్లె ప్రగతి ప్రణాళికతో పల్లెల్లో రూపు రేఖలు మారి ఎంతో ప్రగతిని సాధిస్తున్నాయని సర్పంచ్ రంగమైన రాములు, ధర్మారం సర్పంచ్ గూళ్ల పుష్ప అన్నారు. శుక్రవారం ఆయా గ్రామాల్లో ప్రణాళిక పనులు, ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జోరుగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో ఇరు గ్రామాల ఎంపీటీసీలు ధర్మారం చిన్న లక్ష్మి, చెప్యాల శ్రీనివాస్, ఉప సర్పంచ్‌లు, వార్డు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంకిరెడ్డిపల్లిలో పారిశుధ్య పనులు ముమ్మరం..
రాయపోల్ : మండలంలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సర్పంచ్ వెంకట్‌నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు శుక్రవారం గ్రామంలో అధికారులు పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలోని మరుగుదొడ్లులేని వారిని గుర్తించి వెంటనే మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ముగ్గు పోసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ నిర్మల, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా.. ప్రణాళిక పనులు..
దౌల్తాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక పనులు గ్రామాల్లో ముందుకు సాగుతున్నాయని సూరంపల్లి సర్పంచ్ అయ్యంగారి నర్సింహులు అన్నారు. శుక్రవారం సర్పంచ్ ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో వివిధ రకాల పారిశధ్య పనులు చేపట్టారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇండ్లల్లోని పాత కుండలను, ఇతర పాత సామాండ్లను ఉంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ అధికారి వెంకయ్య, టీఆర్‌ఎస్ నేతలు రవీందర్, సత్యం ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...