విద్యార్థులను ప్రోత్సహించేందుకే అవార్డులు


Fri,September 20, 2019 11:18 PM

దుబ్బాక టౌన్ : విద్యార్థుల్లో చదువుతో పాటు క్రీ డల్లో పోటీతత్వం పెంపొందించేందుకే పతకాలు అందజేస్తారని దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడ్డం బాలకిషన్ అన్నారు. 2018-19 సంవత్సరంలో 10వ తరగతిలో ఉ త్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు చింత రామలక్ష్మీవిశ్వనాథం స్మారక అవార్డులను వారి కుటుంబ సభ్యులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భం గా పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బాలకిషన్ మాట్లాడారు. ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులు గజ్జెల మేఘన, బండె సాయికుమార్, వెంకటేశ్‌గౌడ్‌లకు గోల్డ్ మెడల్స్‌తో పాటు రూ.5వేలు, ప్రశంసా పత్రంను అందజేయడంతో పాటు తల్లిదండ్రులు లేని అనాథలైన 40 మంది విద్యార్థులకు రూ.8వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో చింత రామలక్ష్మీ కు టుంబ సభ్యులు రాజేశ్వర్‌రా వు, దక్షిణమూర్తి, కృష్ణమూర్తి, ప్రకాశ్, డాక్టర్ చంద్రశేఖర్, మహేశ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...