విద్యార్థులు పట్టుదలతో అభ్యసించాలి


Thu,September 19, 2019 11:13 PM

మిరుదొడ్డి : విద్యార్థులు చిన్న తనం నుంచి పట్టుదలతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులతో పాటు విద్యార్థులు చేస్తున్న టిఫిన్స్‌ను పరిశీలించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు అభ్యసిస్తున్న హాస్టల్లకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ, సకల సదుపాయాలను కల్పిస్తుందని పే ర్కొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి స్వర్ణలత, కో ఆప్షన్ స భ్యుడు ఎండీ.అహ్మద్ పాల్గొన్నారు.

కీర్తనకు అభినందనలు
రాష్ట్రస్థాయిలో బాపూజీకి ఉత్తరం జూనియర్ విభాగంలో తన ప్రతిభను చాటి ప్రథమ బహుమతిని పొందిన ఆరెపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థిని శృతి కీర్తనను గురువారం ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వెయ్యి రూపాయలు కీర్తనకు అందజేసి ఇరువురు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిట్ల సత్యనారాయణ, హెచ్‌ఎం భాగ్యలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ.అహ్మద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...