ఆకుపచ్చ రాజీవ్ రహదారి కావాలి


Thu,September 19, 2019 11:11 PM

(సంగారెడ్డి, నమస్తేతెలంగాణ ప్రధానప్రతినిధి)పచ్చదనం వెల్లివిరిసేలా రాజీవ్హ్రదారి ఆకుపచ్చగా తయారు కావాలని, అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్ చందూలాల్‌ను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ మాదాపూర్‌లోని తన ఆఫీసులో రహదారిపై సీఈతో సమీక్షించారు. రహదారికి ఇరువైపుల, మధ్య డివైడర్‌లో మొక్కలు లేని చోట వెంటనే మొక్కలు నాటాలని సూచించారు. మధ్యలో అందమైన పూలమొక్కలు, రోడ్డుకు ఇరువైపుల నీడనిచ్చే మొక్కలు నాటాలని చెప్పారు. దుద్దెడ, కుకునూర్‌పల్లి వద్ద సర్వీసు రోడ్డు లేకపోవడంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఈ దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు రోడ్డు ఏర్పాటుతోనే సమస్య పరిష్కారమవుతుందని, అందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్డుపై పచ్చదనంతో పాటు గుంతలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, ప్రధాన మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆయా ప్రదేశాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాన రహదారి కావడంతో రోజువారీగా వేలాది వాహనాలు రవాణా సాగిస్తాయని, అయితే చాలా చోట్ల లైటింగ్ లేక ఇబ్బందిగా మారిందన్నారు. లైటింగ్ లేని ప్రదేశాలను గుర్తించి, ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణలో పెద్ద పుణ్యక్షేత్రమైన కొమురవెల్లికి రోజువారీగా పెద్ద ఎత్తున వాహనాల్లో భక్తులు తరలివస్తున్నారని, రాజీవ్హ్రదారి నుంచి ఆలయానికి వెళ్లే మార్గం బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గజ్వేల్ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్లే రహదారిలో అక్కడక్కడ రోడ్డు దెబ్బతిన్నదని, దానికి బాగుచేయాలన్నారు.ఇటీవల కాలంలో రోజువారీగా రాజీవ్ రహదారి మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి వేలాది వాహనాల్లో ప్రజలు వెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్‌రాహదారి బాగుండేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని చీఫ్ ఇంజినీర్ చందూలాల్‌ను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.

సూచికబోర్డులు ఏర్పాటు చేయాలి
రాజీవ్హ్రదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా రిమ్మనగూడ, కొడకండ్ల, చిన్నకిష్టాపూర్ ఎక్స్‌రోడ్, కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సమీపంలో, మంగోల్ ఎక్స్‌రోడ్, చేర్యాల జంక్షన్, కొండపాక స్టేజీ, తిమ్మారెడ్డిపల్లి, ముట్రాజ్‌పల్లి జంక్షన్‌లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను ఎంపీ గుర్తు చేశారు. ఈ ప్రదేశాల్లో సూచిక బోర్డులు, సిగ్నల్ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...