ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభం


Thu,September 19, 2019 12:46 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : క్రీడాకారులు మరింతగా రా ణించి జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా నిలుపాల ని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 65వ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి పద్మాకర్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలపై ఆసక్తి కనబరిచేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. విద్యా, క్రీడలపై మంత్రి హరీశ్‌రావు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందుకే సిద్దిపేటలో చాలా టోర్నమెంట్‌లు జ రుగుతున్నాయన్నారు. జిల్లా విద్యాధికారి రవికాంతారావు మాట్లాడుతూ.. గత ఏడాది 50 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో, 500 మంది రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారని అన్నారు. ఆటలతో పాటుగా చదువు అనే కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యద ర్శి గ్యాదరి భిక్షపతి, వ్యాయామ ఉపాధ్యాయులు స త్యనారాయణరెడ్డి, పా తూరి సుజాత, తోట స తీశ్, పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...