గ్రామాన్ని సందర్శించిన గడా ప్రత్యేకాధికారి


Thu,September 19, 2019 12:45 AM

కొండపాక : మంగోల్ గ్రామాన్ని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి బుధవారం సందర్శించారు. కాలినడకన గ్రామవీధుల్లో పర్యటించి గ్రామస్తులతో పనుల గురించి అడిగితెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో జరిగిన ప్రణాళిక పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్‌కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి సురేశ్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సమీర్, టీఆర్‌ఎస్ నాయకులు సంతోశ్‌రెడ్డి, లగిశెట్టి కనకయ్య పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...