మారుతున్న పల్లెలు..


Tue,September 17, 2019 11:59 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక ఊరూరా ఉద్యమంలో కొనసాగుతుంది. 12 రోజుల్లో చాలా గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. పాడుబడిన గోడలతోపాటు ఇండ్లు, పాత బావులు పూడ్చివేయడంతోపాటు పారిశుధ్య పనులు, శ్రమదానాలు ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. విద్యు త్ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరిస్తున్నారు. పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి 30 రోజుల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. అనంతరం బెజ్జంకి, కోహెడ మండల కేం ద్రాల్లో అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ బెజ్జంకి, కోహెడ మండల కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు.
అలాగే, జాయింట్ కలెక్టర్ పద్మాకర్.. మిరుదొడ్డి, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో అధికారులతో ప్రత్యేక సమావేశమై దిశానిర్దేశం చేశారు. 12 రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని గ్రామాల్లో జో రుగా పారిశుధ్యం పనులు కొనసాగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యం తో పనులు కొనసాగడంతో గ్రామాలు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. కరెంట్ సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల్లో ఉన్న ట్రాన్స్‌కో అధికారులు నోట్ చేసుకుని అందుకనుగుణం గా పనులు చేపడుతున్నారు. విద్యుత్ ఎస్‌ఈ కరుణాకర్‌బాబు మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు జిల్లాలో పర్యటించి 30 రోజుల ప్రణాళికను రాష్ట్రంలోనే నంబర్ -1 స్థానం తీసుకరావడానికి కృషి చేస్తున్నారు.

జిల్లాను ఆదర్శంగా నిలుపాలి : కలెక్టర్
30 రోజుల పల్లె ప్రణాళిక అమలులో జిల్లాను రాష్ర్టానికు ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు , డీపీవో సురేశ్‌బాబుతో కలిసి జిల్లాలో ప్రణాళికల రూపకల్పన, నిధుల వినియోగం, చెల్లింపుల అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. రికార్డులు నమోదు చేసి వెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు. గ్రామాల్లో అవసరమైన మేర నిధులను వినియోగించుకోవాలని, వాటిని వెంటనే రికార్డు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ వార్షిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామ పంచాయతీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని, అలాగే, వంగిన, విరిగిన ఐరన్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హరితహారం మొ క్కలను సంరక్షించాలన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి ఏ మొక్కలు నాటా లనేది నిర్ణయం తీసుకుని ఇప్పటినుంచే పనులు చేపట్టాలన్నా రు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల స్థల పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో ఏపీఎంలు, డీపీఎంలు, ఏఈలు, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

అందరూ గ్రామాల్లోనే ఉండాలి
బెజ్జంకి : 30 రోజుల పల్లె ప్రణాళిక లో రాష్ట్రంలో జిల్లాను ఆదర్శంగా నిలువాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంబెజ్జంకిలోని సత్యార్జున గార్డెన్‌లో 30 రోజుల ప్రణాళికపై సర్పం చ్, ఎంపీటీసీలు, అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం చేపట్టారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ మట్లాడుతూ.. ఆరోగ్యకర గ్రా మాలుగా తీర్చిద్దుకునేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, దీనిని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో చెత్త్తాచెదరాలు పేరుకుపోవడంతో దోమలు, ఈగలతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నామని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, మహిళలు భాగస్వాములై 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలన్నారు. నర్సరీల్లో గ్రామానికి సరిపడే మొక్కలను సమకూర్చుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయంతో గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొదట రోడ్డుపై ఉన్న చెత్తాచెదరం, మట్టిదిబ్బలు, ముగురునీటి గుంతలు, పాతబావులు, శిథిలావస్థ ఇండ్లు తొలగించాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, లక్ష్యానికి మించి హరితహరం మొక్కలు నాటాలని కోరారు. గ్రామసభ నిర్వహించి, వార్షిక, పంచావర్షప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనుకడబోమని హెచ్చరించారు. ప్రణాళికల్లో గుర్తించిన అభివృద్ధి పనులకు ఇప్పటికే నిధులు మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలా న్ని గుర్తించామని, స్థలం లేని గ్రామాల్లో దాతల సహాయంతో సేకరించాలని, వీలుకుంటే స్థలాల కొనుగో ళ్లకు చెక్కు ఇస్తామన్నారు. మండలంలో ఆదర్శంగా నిలిచిన 1, 2, 3 స్థానాలతోపాటు జిల్లాస్థాయిలో నిలిచిన గ్రా మాలకు ప్రత్యేక అవార్డు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలోని 499 మంది ప్రత్యేకాధికారులు గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అం దుబాటులో ఉండాలని సూచించారు. జిల్లా కేంద్రం లోని ప్రత్యేక కంట్రోల్‌రూంలో పనులను పర్యవేక్షిస్తున్నమని వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, డీపీవో సురేశ్‌బాబు, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌రావు, తహసీల్దార్ హరిబాబు, ఎంపీడీవో ఓబులేశ్, సర్పంచ్ మంజుల, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామ స్వరాజ్యం సాధించాలి: జడ్పీ చైర్‌పర్సన్
కోహెడ : 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాల్లో గ్రామ స్వరా జ్యాన్ని సాధించాలని జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. కోహెడలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో 30 రోజుల ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు కలెక్టర్ వెంకట్రామరెడ్డితో కలిపి నిర్వహించిన సమావేశంలో జడ్పీచైర్‌పర్సన్ మాట్లా డా రు. ప్రగతే ధ్యేయంగా 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్న ట్లు తెలిపారు. అధికారులు, స్థానిక ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. చెంచెల్‌చెర్వుపల్లిలో సర్పంచ్ భీంరెడ్డి సత్యవతి చేస్తున్న పనులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ఏఎంసీ చైర్మన్ పేర్యాల దేవేందర్‌రావు, సర్పంచ్ పేర్యాల నవ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీటీసీ ఖమ్మం స్వరూప, ఎంపీడీవో దేవేందర్‌రాజు, ఏవో బోగేశ్వర్, తహసీల్దార్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...